సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అప్ రాష్ట్రంలో కూడా వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు, శనివారం సీఎం చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ సమావేశంలో అధికారులతో రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాలో ప్రజలకు హోటల్స్ ఇతర వ్యాపార సంస్థలకు ఏర్పడుతున్న ఇబ్బందులు వాటిని అధిగమించవలసిన పద్దతులపై వివరంగా చర్చించారు. అసలు వాస్తవ పరిస్థితిని అంచనా వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అన్ని ఎఫర్ట్స్ పెట్టి సమస్య లేకుండా ప్రయత్నాలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. నేటి ఉదయం 11:30 గంటలకు గ్యాస్ సరఫరా అంశంపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ భేటీ అవుతున్నట్లు సీఎంకు మంత్రులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *