సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం నేపథ్యంలో దేశంలో చమురు, గ్యాస్ కొరతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రజలను భయపెట్టేలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వంట గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువును చమురు కంపెనీలు 35 రోజులకు పెంచినట్టు గత మంగళవారం వార్తలు హల్‌చల్ చేశాయి. ఆ వార్తలపై నేడు, బుధవారం తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది ఎల్పీజీ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవని కేంద్రం పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది.కనెక్షన్‌తో సంబంధం లేకుండా పట్టణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్‌కు 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు ఎప్పటిలాగానే కొనసాగుతుంది’ అని కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *