సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెం లోని శ్రీసిటీ పారిశ్రామికంగా దేశంలో అరుదయిన ఘనతను సాధించింది. ప్రస్తుతం దేశంలో ప్రాచుర్యం పొందుతున్న వందేభారత్ సెమీ హైస్పీడ్ రైలు విడిభాగాలు ఇక్కడి బీఎఫ్జీ ఇండియా పరిశ్రమలో ఉత్పత్తి అవుతుండటమే ఇందుకు కారణం. త్వరలో వందల సంఖ్యలో వందేమాతరం ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టనున్న ఈ తరుణంలో ఈ బీఎఫ్జీ ఇండియా కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక రంగంలో అరుదయిన ఘనత సాదించనుంది. ఈ కంపెనీ 2009 నుంచి పవన విద్యుత్, నిర్మాణ, రవాణా వంటి రంగాల్లోని పరిశ్రమలకు మిశ్రమ ఉత్పత్తులును తయారు చేస్తోం ది. ప్రధానం గా మెట్రో కోచ్ల తయారీ సంస్థలైన ఆల్స్తోమ్, బొంబార్డియర్, వోల్వో లతోపాటు ఇండియన్ రైల్వే స్, జనరల్ ఎలక్ట్రికల్-ఎనర్జీ, గమేశ, కొచ్చిన్షిప్యార్డు, థెర్మాక్స్ వంటి వివిధ సంస్థలు దీని సేవలను అందుకుంటున్నాయి. వందేభారత్ రైలులోని ఇంటీరియర్, టాయిలెట్ క్యాబిన్, ఇంజిన్ ముందుభాగాన్ని బీఎఫ్జీ సంస్థ సరఫరా చేస్తోంది. ఒక్కో రైలు కోసం 329 రకాల ఫైబర్ రీ ఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్(ఎఫ్ఆర్పీ ) ప్యా నెళ్లను తయారు చేసింది. ఇచ్చిన పనులను రికార్డుస్థాయిలో పది నెలల్లోనే పూర్తి చేసిందంటే ఈ కంపెనీ సత్తా అర్ధం చేసుకోవచ్చు..
