సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎట్టకేలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైల్ కు హోల్డ్ లభించనుంది. ఏలూరు ,తాడేపల్లి గూడెం మీదుగా సికింద్రాబాద్ మరియు విశాఖ మధ్య నడిచే వందేమాతరం రైలు ప్రయాణిస్తున్న విషయం అందరికి విదితమే. అయితే అక్కడ రైళ్లు ఆగకపోవడం తో స్థానిక ప్రయాణికులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఏలూరులో ఈ నెల 26వ తేదీ నుండి వచ్చే ఆగస్టు నెల ఆఖరు వరకు సుమారు 6 నెలలు తాత్కాలిక హోల్డ్ ఇచ్చారు. తదుపరి పొడిగించవచ్చు. దీనితో పాటు సామర్లకోట రైల్వే స్టేషన్ లో కూడా హోల్డ్ ఇవ్వడం తో గోదావరి జిల్లాల ప్రయాణికులకు కొంత వేళుసుబాటు కలిగింది.
