సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 15న సోమవారం నరసాపురం – చెన్నై మధ్య మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి భీమవరంలో భారతీయ జనతా పార్టీ నాయకులు నిర్ణయించారు. ఈ చారిత్రక కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను, ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులను ఆహ్వానించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ​కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తరుపున బీజేపీ జిల్లా నాయకులు కలిదిండి వినోద్ వర్మ, తోట గంగరాజు, తదితరులు నేడు,శనివారం రాజ్యసభ ఎంపీ పాకా సత్యనారాయణ,​ ​భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులు, ,​టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మి,​టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, ​తదితర ప్రముఖులను కలసి ఆహ్వాన పత్రికతోపాటు నరసాపురం నుండి వందే భారత్ రైలులో ప్రయాణించడానికి ప్రత్యేక టికెట్‌ను సైతం అతిథులకు అందజేసి ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *