సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజ్య సభలో తగినంత బలం లేకపోయినా మోడీ సర్కారు అనుకున్నది సాధించింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదాలకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025పై ఎట్టకేలకు ఆమోదముద్ర వేయించుకుంది. ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. రాజ్యసభలో గత గురువారం అర్ధరాత్రి దాటే వరకు దీని మీద తీవ్ర చర్చ జరిగింది. వైసీపీ ఎంపీ, ప్రముఖ లాయర్, నిరంజన్ రెడ్డి వక్ఫ్ బిల్లు సవరణలు ముస్లీమ్ వర్గాలకు మేలు చేసేలా మరింత మార్చాలని విజ్ఞప్తి చేసారు. ఇతర దేశాల నుండి భారత్ లో మసీదులకు వచ్చే ఇచ్చే విరాళాలు, ఇచ్చే ఆస్తులపై చట్టంలో మరింత పారదర్శకత ఉండాలని కోరారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు జవాబుల తర్వాత సవరణల వారీగా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు మద్దతుగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటు వేశారు.( అదే లోక్‌సభలో బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి). విచిత్రం ఏమిటంటే లోక్ సభలో4 గురు ఎంపీలతో వ్యతిరేకించిన వైసీపీ పార్టీ రాజ్య సభలో (మొత్తం వైసీపీ 11 మంది ఎంపీలకు 4గురు రాజీనామా చెయ్యడంతో..), అయినప్పటికీ ఏపీ నుండి అత్యధిక సభ్యులు ఉన్న వైసీపీ కి ప్రస్తుతం ఉన్న 7 ఎంపీల కీలక బలంతో, మోడీ సర్కార్ కు మద్దతు పలకడం విశేషం. అలాగే మోడీ సర్కార్ ను వ్యతిరేకిస్తున్న ఒరిస్సా లోని బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన 9 మంది ఎంపీ లు రాజ్యసభలో వక్ఫ్ బిల్లు కు మద్దతు పలకడం దీని వెనుక అమిత్ షా వ్యూహాలకు తిరుగులేదని మరోమారు రుజువు చేసింది. ఏది ఏమైనా ముస్లీముల కోసం వక్ఫ్ (సవరణ) బిల్లు ను లోక్ సభలో వ్యతిరేకించిన వైసీపీ అధినేత జగన్ రాజ్యసభలో మాత్రం మోడీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక సమయంలో తన సహకారం అందించడం అనేక విమర్శలకు తావిచ్చింది. ( up file photo)
