సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముస్లీముల.. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడం శుభపరిణామమని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీయే కూటమి పార్లమెంటరీ విజయం కంటే ఎక్కువ ప్రతిబింబిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ బిల్లుఫై అన్ని రాజకీయ పార్టీలతో సుదీర్ఘకాలం చర్చ జరిగిందని లోక్‌సభలో దాదాపు 12 గంటలు, అలాగే రాజ్యసభలో దాదాపు 14 గంటలు పూర్తిగా చర్చలు జరిగాయని.. ఈ బిల్లుపై ఏకపక్ష నిర్ణయం కాకుండా ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి ఆందోళనను పరిష్కరించారని, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు. ఇది న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనం వైపు ఒక చారిత్రాత్మక అడుగు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. వక్ఫ్ ప్రయోజనాలు పేద ముస్లింలకు చేరేలా చూడటం, ముస్లిం మహిళలకు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడం వైపు ఈ సవరణ ఒక ముఖ్యమైన అడుగు అని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
