సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంతి వచ్చే ఎన్నికలకు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 1,460 పోలింగ్ కేంద్రాలు ఉన్నా యని, వాటిలో 43 పోలింగ్ స్టేషన్ల లొకేషన్ మార్పు కోసం, 207 పోలింగ్ స్టేషన్ల పేరు మార్పు కోసం ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదించామని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లాలో ఆరు కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదిం చామన్నారు. వీటిలో భీమవరం గునుపూడి తాడేరు ప్రాంతంలో వేలాది టిడ్కో నివాసితులకు అనువుగా కొత్తగా మరో రెండు పోలింగ్ బూత్ లను ఏర్పాటు చెయ్యడానికి ప్రతిపాదన పంపామన్నారు. జిల్లాలో , ఓటర్ల జాబితా ఇంటింటా పరిశీలన ఒకటికి రెండుసార్లు చేసామన్నారు. ఇంకా జిల్లాలో ఓటరు జాబితాకు సంబంధించి అందిన క్లెయిమ్స్ , అభ్యంతరాలు పక్కా గా పరిశీలిస్తున్నామన్నారు.
