సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశంలో రాజకీయ ప్యూహాలు, ఎన్నికల స్టాటజీ ని బాగా జీర్ణించుకున్న మేధావి..ఐ ప్యాక్.. ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాలలో సీఎం జగన్ కు చెందిన వైస్సార్సీపీ కి దిశానిర్దేశ్యం చేసే కీలక వ్యక్తి అని అందరికి తెలిసిందే.. మరో వచ్చే ఎన్నికలలో వైసీపీ తరపున నిలబెట్టవల్సిన అభ్యర్థుల కోసం ఐ ప్యాక్ టీం సర్వే చేసిన నేపథ్యంలో ఏపీలో వివిధ నియోజకవర్గాలలో గెలుపు కు అవకాశం ఉన్న 75 మంది అభ్యర్థుల మొదటి లిస్ట్ వచ్చినట్లు లీక్ లు విడుదలయ్యాయి. వాటిలో భాగంగా ఐ ప్యాక్ టీం సర్వే ఆదారంగా వచ్చిన లిస్ట్ అని భావిస్తున్న అభ్యర్థులు ఇక సీఎం జగన్ అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని భావిస్తూ తమ సీట్లు లో వచ్చే ఎన్నికలకు పూర్తీ స్థాయి సన్నాహాలు చేసుకొంటున్నారు. ఇందులో ఆసక్తి పరిణామం, అనేక అపోహలు ను తొలగిస్తూ .. భీమవరం నియోజక వర్గానికి వైసిపి అభ్యర్థిగా తిరిగి స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను ‘ఐ ప్యాక్’ ఎంపిక చేసిందన్న వార్త పార్టీ క్యాడర్ పాటు ఆయన అభిమానులలో జోష్ నింపింది. మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే నియోజకవర్గం లో పోటీ కి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో మరోసారి ‘భీమవరం ఫలితం’ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి తీవ్ర ఆసక్తి పెంచనుంది. ‘పోగొట్టుకున్నా చోటే గెలుపు’ సత్తా సాధించాలని పవన్ పట్టుదల ఒకవైపు.. ఒకసారి పవన్ ఫై గెలచి చరిత్ర సృష్టించిన గ్రంధి శ్రీనివాస్ మరోసారి గెలచి తనముందు ఏ పవర్ పనిచేయదని భీమవరం లో తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ముచ్చటగా 3వ సారి ఎమ్మెల్యే కావాలని ముందడుగు వేస్తున్నారు. ఇక టీడీపీ పొత్తు కుదుర్చుకొంటే భీమవరం జనసేనకు కేటయింపు ఎలాగూ తప్పదు, అయితే మరో ఆసక్తి పరిణామం ఏమిటంటే భీమవరం నియోజకవర్గం వీరవాసరం కు చెందిన ప్రముఖుడు గుడాల రవి కి పాలకొల్లు అభ్యర్థిగా వైసిపి సీటు ఖరారు చేస్తున్నారని వార్త కూడా ఆసక్తి రేపుతోంది.
