సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో .. 2024 కొత్త ఏడాది జనవరి నెల నుంచి జీతాలతో పాటు అలవెన్స్ ల చెల్లింపు జరపనుంది ప్రభుత్వం. ఈ మేరకు అధికారులకు సీఎం జగన్ తాజగా ఆదేశాలు సైతం జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ ఉద్యో గులు రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ అధికారంలోకి రాగానే.. సుమారు 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ను ప్రభుత్వ ఉద్యోగుల క్రింద మార్చడమే కాకుండా మరల ఎన్నికలు సమీపిస్తున్న వేళా తమ జీతాలు పెంచడంపై సీఎం జగన్ కు కృతజ్ఞలు తెలుపుతున్నారు.
