సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపల్ కమిషనర్ తాజగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విధంగా తెలియజేసారు. భీమవరం పురపాలక సంఘ పరిధిలో రోడ్లుపై ఆవుల సంచారము అధికముగా ఉండుటవలన రోడ్డు మీద వెళ్లు వాహనదారులకు / పాదదారులకు ఆటంకము, ప్రాణనష్టము / ప్రమాదములు మరియు పారిశుద్ధ్యమునకు ఇబ్బంది కరముగా వుండుట వలన ఆవులను పట్టణ పరిధి లోని రోడ్ల మీదకు వదిలివేయరాదని మైకు ద్వారా పలుమార్లు తెలియజేసిన, పురపాలక సంఘ కార్యాలయము నుండి ఆవుల యజమానులకు అనేక పర్యాయములు నోటీసులు జారీ చేసినప్పటికీ . కానీ వారు నిర్లక్ష్యముగా వ్యవహరిస్తున్నారని కావున ది.09.09.2024 (సోమవారం) నుండి బహిరంగా ప్రదేశములలో సంచరించు ఆవులను పురపాలక సంఘము వారు స్వాధీన పరుచుకొని గోశాలల కు తరలించడం జరుగుతుంది. మరియు ఆవుల యజమానులపై ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘ చట్టము 1965 ననుసరించి చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని హెచ్చరించారు.
