సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రాష్ట్రంలో ముఖ్యముగా రాయలసీమ ప్రాంతంలోనూ తమిళనాడు కృష్ణగిరి, ధర్మపురి,మదురై, విరుదునగర్, తేని జిల్లాల్లోను మూడు రోజులపాటు కొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరుగా వర్షం కురుస్తుందని భారత వాతావరణ పరిశోధన కేంద్రం సౌత్ జోన్ చైర్మన్ బాలచంద్రన్ ప్రకటించారు. వచ్చే రెండు రోజుల్లో ఆకాశం మేఘావృతంగా ఉండి, పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. జాలర్ల చేపలవేటకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు లేవని ఆయన ప్రకటించారు.
