సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ల సమీపంలోని ఎం ఎం పురంలో నేడు, ఆదివారం మాజీమంత్రి వట్టి వసంత్ కుమార్ భౌతిక కాయానికి శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలిపారు, ఆయన తో పాటు గతంలో తాను కాంగ్రెస్ పార్టీ జిల్లా అడ్జక్షుడుగా పని చేసినప్పుడు ఆయన రాష్ట్రంలో మంత్రిగా చేసినప్పుడు తరువాత కూడా మిత్రుడుగా సుదీర్ఘంగా కొనసాగిన అనుబందాన్ని ఈసందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ కేంద్ర నేత కెవిపి, రామచంద్రరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, భీమవరం నుండి గోకరాజు రామరాజు తదితరులు హాజరై వట్టి వసంత కుమార్ ను చివరి చూపు చూసుకొని ఘన నివాళ్లు అర్పించడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ‘వట్టి’ కుటుంబ సబ్యులకు సంతాపం తెలపడం జరిగింది.
