సిగ్మాతెలుగు డాట్, ఇన్న్యూస్: ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఎం. పురంలో వట్టి వసంత కుమార్ గృహానికి నేడు, సోమవారం వెళ్లిన భీమవరం ఎమ్మెల్యే శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారు వట్టి వసంత్ కుమార్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి అక్కడే ఉన్న కెవిపి రామచంద్రరావు తో కలసి వట్టి కుటుంబసభ్యులను పరామర్శించారు. తదుపరి గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉంగుటూరు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా లెక్కలేనన్ని సేవలందించిన వట్టి వసంత్ గారు మృతి బాధాకరమన్నారు. స్వర్గీయ,మాజీ సీఎం వై యస్ హయాంలో భీమవరం ఎమ్మెల్యే గా తనకు నా శ్రేయోభిలాషి గా,మంత్రిగా వట్టి భీమవరం అభివృద్ధి కి అందించిన సహకారం మరువలేనిది అన్నారు.
