సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వీరవాసరం మండలం వడ్డిగూడెంలో ఇటీవలే జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను నేడు, సోమవారం ఉదయం ఎమ్మెల్యే అంజిబాబు పరామర్శించారు. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటామని, ప్రభుత్వ సహకారాన్ని అందిస్తామని బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వెంటనే బాధితులకు ఇల్లు వచ్చేలా చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపి రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వర్రావు, వీరవల్లి శ్రీనివాస్, ఎంపిపి వీరవల్లి చంద్రశేఖర్ దుర్గాభవాని, అప్పాజీ, గండి భూషణం, కారుమూరి సత్యనారాయణ మూర్తి, విజ్జురోతి రాఘవులు, గ్రామ పెద్దలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
