సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రోజు రోజుకు రికార్డు బ్రేక్ చేస్తూ పెరుగుతూనే ఉంది. కానుకలతో కళకళలాడుతోంది. టీటీడీ గత ఏడాదిలో రికార్డుస్థాయిలో 1,031 కేజీల బంగారాన్ని (దాదాపు రూ.773 కోట్ల విలువ) వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిందంటే అవాక్కు కానివారు ఎవరు ఉంటారు? . వడ్డికాసులవాడిని దర్శించుకునే భక్తులు తమ స్థాయిని బట్టి హుండీలోకానుకలు సమర్పిస్తుంటారు. హుండీలో నగదుతో పాటు బంగారం, వెండి కూడా స్వామికి అందుతుంటుంది. పురాతన సంప్రదాయమైన నిలువుదోపిడి ఇప్పటికి కొనసాగుతోంది. తాజా డిపాజిట్‌తో టీటీడీ బంగారం డిపాజిట్లు 11,329 కేజీలకు చేరుకున్నాయి. వీటి విలువ సుమారు రూ.8,496 కోట్లు రూపాయలు గా భావిస్తున్నారు, ఇక, నగదు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయానికి వస్తే 2023–24 ఏడాదికి సంబంధించి రూ.1,161 కోట్లను టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసింది. దీంతో టీటీడీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.18 వేల కోట్లకు చేరాయి. టీటీడీకి బంగారు, నగదు డిపాజిట్ల ద్వారా ఏడాదికి సుమారు రూ.1,200కోట్లు వడ్డీ రూపంలో వడ్డీ కాసులవాడికి అందుతున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *