సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేర‌ళ రాష్ట్రంలోని వ‌య‌నాడ్‌లో కొండ చ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌నలో అధికారికంగా ఇప్పటివరకు 260 మంది మృతులను ప్రకటించినప్పటికీ ఇంకా ఎందరో మరణించారని భావిస్తున్నారు. ఎన్నో కుటుంబాలు విషాదం లో మునిగిపోయాయి. ఈ దారుణ ప్రక్రుతి వైపరీత్యం యావ‌త్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గత్ మంగళవారం నుండి ఇంకా బాధితులను రక్షించే కార్యక్రమం జరుగుతూనే ఉంది. బాధితుల‌కు సాయం చేసేందుకు ఒక భారత జవాన్ గా సినీ హీరో మోహ‌న్‌లాల్ కూడా ముందుకు వ‌చ్చారు. గతంలో ఒక సినిమాలో పాత్ర కోసం నిజంగానే ఆర్మీ ట్రయినింగ్ తీసుకొన్నారు. దానికి ప్రతిగాఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ కూడా అయిన మోహ‌న్‌లాల్ నేడు శ‌నివారం ఆర్మీ యూనిఫాం ధ‌రించి వయ‌నాడ్‌కు చేరుకున్నారు.మెప్పాడిలోని ఆర్మీ క్యాంపు వద్దకు చేరుకున్న నటుడు, అధికారులతో కొద్దిసేపు చర్చించి..వారితో కలసి కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి వెళ్లారు. తదుపరి నేటి సాయంత్రం ఆస్ప‌త్రిలోచికిత్స పొందుతున్న బాధితుల‌ను మోహ‌న్ లాల్ ప‌రామ‌ర్శించ‌నున్నారు. మరోవైపు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. డ్రోన్లు, రాడార్లు, మొబైల్‌ ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *