సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం DNR వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్ధం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కి 1,30,116 రూ . (ఒక లక్షా ముప్పై వేల నూట పదహారు రూపాయలు) అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎంఎల్ఏ శ్రీ రామాంజనేయులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి మానవతా దృక్పథంతో డీఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు చేసిన సహాయం వెల కట్టలేనిదని కొనియాడారు.ఈ కార్యక్రమంలో DNR వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు K.శివరామరాజు, అధ్యక్షులు కె పల్లారావు,సెక్రటరీ P.సీతారామరాజు, ట్రెజెరర్ KV రామకృష్ణ, మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు బొండా రాంబాబు,భట్టిప్రోలు శ్రీనివాసరావు,కార్మూరి సత్యనారాయణమూర్తి,తదితరులు పాల్గొన్నారు. మరో కార్యక్రమంలో భీమవరం ఆర్ఎంపి & పి.ఎం.పి అసోసియేషన్ తరపున భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కి 10,116 రూ// లను విరాళం అందజేశారు.
