సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం లో నేడు, బుధవారం బి.వి రాజు (విష్ణు కాలేజ్) విద్యాసంస్థల చైర్మన్ కె.వి విష్ణు రాజు ఇటీవల విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. బివి రాజు కళాశాలల యాజమాన్యం ఇటీవల వరదల సమయంలో విద్యార్థులు అధ్యాపకుల సహకారంతో వేలాది మంది బాధితులకు ఆహారం అందించడం లో పాటు ఆర్ధికంగా కూడా ఇప్పుడు 25 లక్షల రూపాయల పెద్ద మొత్తంలో సహాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాకర విద్య సంస్థగా పేరున్న విష్ణు విద్యాసంస్థలు చైర్మెన్ విష్ణు రాజు అయన తాత గారు స్వర్గీయ బివి రాజు బాటలో ఇటువంటి దాతృత్వం కలిగి ఉండటం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఈ విషయంలో బివి రాజు విద్యాసంస్థలు ముందు వరుసలో నిలుస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
