సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ వరద బాధితులకు సహాయక చర్యల్లో భాగంగా బుధవారం పశ్చిమగోదావరి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యవేక్షణలో పెద్ద ఎత్తున వేలాది ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ విజయవాడకు ప్రత్యేక వాహనములలో తరలి వెళ్లాయి. ఈ సందర్భంగా ది భీమవరం ఆక్వా డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 వేల ఆహార పదార్థాలను జెపి రోడ్డులోని శ్రీభగవాన్ ట్రేడర్స్ కార్యాలయం వద్ద అశోసియేషన్ తరపున విజయవాడ వరద భాదితుల సహాయార్ధం ఆహార పదార్థాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. దాతలు ముందుకు వచ్చి వరద బాధితులకు ఇటువంటి సహకారం అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ది భీమవరం ఆక్వా డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నడింపల్లి వెంకట రామరాజు, కార్యదర్శి వేగేశ్న రమేష్ రాజు, కడలి రమణ, వేస్పర్ వర్మ, వంశీ, అభిలాష్ వర్మ, జోగిరాజు, కిషోర్ రాజు, భగవాన్, నాగేశ్వర్రావు, రంగరాజు, మంతెన రామ్ కుమార్ రాజు, పేరిచర్ల లక్ష్మణ వర్మ, నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.
