సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ లోని వరద బాధితుల కోసం భీమవరం నుండి సీఎం పండ్ కోసం దాతల సహకారం ఇంకా అందుతూనే ఉంది. నేడు, ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భీమవరం శాఖ వరద బాధితుల సహాయార్థం రూ 2 లక్షల 68 వేలు సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు డాక్టర్స్ అందించారు. మీరు చేస్తున్న సహాయం అందరికీ ఆదర్శమని కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవడం దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డా నడింపల్లి శంకర్ కుమార్ వర్మ, డా గొట్టుముక్కల బాలకృష్ణంరాజు, డా యువి రామణరాజు, డా మేళం రంగారావు తదితరులు పాల్గొన్నారు.
