సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వమని, అందరూ చేయి చేయి కలిపితేనే వరద పరిస్థితుల నుండి ప్రజలను రక్షించుకోగలుగుతామని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ( అంజిబాబు) అన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్ధం కృష్ణ బలిజ టీడీపి బిసి రాష్ట్ర సాధికారిత కమిటీ సభ్యులు గంటా త్రిమూర్తులు ఆధ్వర్యంలో టిడిపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి సమక్షంలో నేడు, బుధవారం రూ 75 వేలు సహకారాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ వరద బాధితులకు సుమారు 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించే విధంగా గంటా నరసింహమూర్తి చే రూ 75 వేలు పంపిస్తున్నామని, అన్నారు.
