సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరానికి చెందిన పర్రిపాటి బిబిఎస్ఎన్ గుప్త (పర్రిపాటి శ్రీను ) తాజాగా నేడు, సోమవారం వరల్డ్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ భూవివాదాలు, పర్యావరణ పరిరక్షణ విభాగం ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఆయన భీమవరం మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షునిగా, జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శిగా వాసవి క్లబ్ రీజియన్ సెక్రెటరీగా, ద్వారకా తిరుమల శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య కళ్యాణ మండపం ట్రస్ట్ సభ్యునిగా సేవలు అందిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించి అందరి అభినందనలు పొందారు. ఆయనలోని సేవా దృక్పధం ను గుర్తించిన వరల్డ్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ రావూరి బాలరాజు, నేషనల్ కమిటీ చైర్మన్ ఎస్ సుధాకర్, ఆయనను ఈ పదవిలో ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *