సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మంత్రి అమిత్ షా గత 2 వరాల ముందు ఒక మాట అన్నారు. ఎంత నష్టాలు వచ్చిన షేర్స్ కొని ఉంచుకోండి. జూన్ 4 తరువాత తమ విజయం తో అవి భారీ లాభాలను ఆర్జిస్తాయి అని.. మరి ఆ మాటలకూ అర్ధం ఏమిటో కానీ, జూన్ 4వ తేదీ సమీపిస్తోంది అనుకొంటుండగా గత 4 రోజులుగా దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదవ రోజైన నేడు, గురువారం కూడా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మే 30న (గురువారం) బీఎస్‌ఈ సెన్సెక్స్ 0.83 శాతం లేదా 617.60 మేర నష్టపోయి 73,885.60 పాయింట్ల ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 సూచీ 216 పాయింట్లు లేదా 0.95 శాతం మేర క్షీణించి 22,500 మార్క్ దిగువన 22,489 వద్ద ముగిసింది. టాటా స్టీల్, టెక్ మహింద్రా, టైటాన్ కంపెనీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, మహింద్రా అండ్ మహింద్రా, టాటా మోటార్స్,వంటి షేర్లు సైతం షేర్లు 1.5 శాతం నుంచి 5.75 శాతం వరకు నష్టాల్లో ముగిశాయి.కాగా గత 3రోజులలో 3 సెషన్లలో కలిపి ఏకంగా రూ.7.8 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో సోమవారం ట్రేడింగ్ ముగింపు సమయానికి రూ.419.95 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ స్థూల మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం సాయంత్రానికి రూ.412.06 లక్షల కోట్లకు పడిపోయింది. ఒక్క గురువారమే రూ.415.09 లక్షల కోట్ల నుంచి రూ.3.03 లక్షల కోట్లు తగ్గి మేర తగ్గి రూ.412.06 లక్షల కోట్ల స్థాయికి పడిపోయింది
