సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత నెల చివరి వరకు దసరా సెలవులతో ఎంజాయ్ చేసిన విద్యార్థులు.. ఇప్పుడు ఈఅక్టోబర్ నెలలో కూడా భారీగా సెలవులు రానున్నాయి. ఈనెల దీపావళి పండగ సీజన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు పలు స్కూళ్లకు శనివారం, ఆదివారంతోపాటు సోమవారం దీపావళి సెలవు రానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం శనివారం 18వ తేదీ, ఆదివారం 19వ తేదీ ఉండగా, 20వ తేదీ దీపావళి పండగ ఉండనుంది. దీంతో వరుసగా సెలవు వస్తున్నాయి.
