సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 రోజులు గా నష్టాలలో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) నేడు, గురువారం కూడా భారీ నష్టాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కె ట్లో బలహీన సంకేతాలుతో సూచీలు నష్టాలకు పడిపోతున్నాయి. నేడు, మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ నష్టాలతో ప్రారంభం అయ్యింది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 948 పాయింట్లు తగ్గి 79,169 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 307 పాయింట్లు తగ్గి 23,891 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ సూచీలో ఇన్ఫో సిస్, ఏషియన్ పెయిం ట్స్ , టాటా స్టీల్, SBI , టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాం క్, హెచ్సీఎల్ టెక్నా లజీస్, ఏషియన్ పెయింట్స్, నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్యూఎల్, ఐటీ, సన్ పార్మా మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ ఏకంగా 85.06 వద్దకు పడిపోయింది.
