సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈవారం మిశ్రమ ఫలితాలలో కదలాడుతున్న భారతీయ స్టాక్ మార్కెట్ లో నేడు, గురువారం రోజంతా లాభాల్లో కదలాడిన మార్కెట్లు చివరకు నష్టాలతోనే ముగిశాయి. అమెరికా మార్కెట్లలో నష్టాలు, ఆసియాలోని ఇతర దేశాల మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉండడం దేశీయ సూచీలఫై ప్రభావం చూపింది. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా సూచీలు నష్టాలతోనే ముగిశాయి. గత సెషన్ ముగింపు (85, 559)తో పోల్చుకుంటే గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి ఎగబాకింది. ఒక దశలో 84, 780 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ చివరకు సెన్సెక్స్ 77 పాయింట్ల నష్టంతో 84, 481 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 25, 815 వద్ద స్థిరపడింది (stock market ). బ్యాంక్ నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 203 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.24గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *