సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 3 రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో తక్కువ స్థాయి నష్టాలతో స్వల్ప లాభాలతో దాదాపు ప్లాట్ గా నడుస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ నేడు, గురువారం అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు ఈ రోజు కూడా కాస్త లాభనష్టాలు అటుఇటుగా ఫ్లాట్‌గానే ట్రేడ్ అవుతున్నాయి. కాఫర్ దిగుమతులపై 50 శాతం సుంకం విధించడం, ఫార్మా ఉత్పత్తులపై కూడా భారీ పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా రంగాలు నష్టాల బాట పట్టాయి. గత బుధవారం ముగింపు (83, 536)తో పోల్చుకుంటే నేడు గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాసేపు లాభాల్లో కదలాడింది. 83,742 వద్ద గరిష్టానికి చేరింది. ఆ వెంటనే నష్టాల్లోకి వచ్చేసింది. సెన్సెక్స్ 179 పాయింట్ల పాయింట్ల నష్టంతో 83, 356 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.62గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *