సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా , అత్తిలిలో నివసిస్తున్న వృద్ధ దంపతులు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాజగా విషాదం నింపింది. అత్తిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. పెరవలి మండలం ముక్కామలకు చెందిన దొంగమళ్ళ నరసయ్య (70) భూలక్ష్మి (60) అక్కడ ఆర్థిక కష్టాలు నుండి గట్టెక్కడానికి అత్తిలి చేరుకొని రెండేళ్లుగా అత్తిలిలో నివశిస్తున్నారు. నరసయ్య కౌలుకు వ్యవసాయం చేస్తూ తీవ్రంగా నష్టపోవడంతో అప్పులు చేశాడన్నారు. వ్యవసాయం వదిలి ఇటీవలే రెండు గేదెలు కొనుగోలు చేశాడు. ఆ గేదలు కూడా అనారోగ్యం తో చనిపోవడంతో ఆర్థిక బాధలు తట్టుకోలేక తీవ్ర మనోవేదనతో గురువారం రాత్రి ఇద్దరూ పురుగుల మందు సేవించారు. అప స్మారక స్థితిలో ఉన్న వీరిని గత శుక్రవారం ఉదయం అత్తిలిలో ఉంటున్న వారి పెద్ద కుమార్తె 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా నిన్న శుక్రవారం చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *