సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సత్య రీ రిలీజ్ సందర్భంగా భీమవరం బ్రాండ్ .. ఒకనాటి పాన్ ఇండియా సూపర్ డైరెక్టర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు జ్ఞానోదయం అయ్యిందని, ఇకపై నిజాయితీగా పని చేసి మంచి సినిమా తీస్తానని ప్రకటించడం అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది. ట్వీట్ పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే ‘సిండికేట్ ‘టైటిల్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం అది కూడా గతంలో మహేష్ బాబు తో వచ్చిన బిజినెస్ మెన్ సినిమా కధ తరహాలో ఆ కథను వర్మ చెప్పటం విశేషం. అయితే ఇందులో బడా స్టార్లు భాగమవుతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతి కి వస్తున్నాం 300 కోట్ల వసూళ్లతో తెలుగు వెర్షన్ లో NO. 1సింగిల్ హీరో హిట్ గా బంపర్ పామ్ లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి లాంటి పెద్ద పేర్లు బయటికి రావడంతో ఇది నిజంగా సాధ్యమవుతుందా? అనే అనుమానాలు తలెత్తతున్నాయి? అయితే ఇటీవల వచ్చిన ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా ను సురేష్ ప్రొడషన్ ఫై వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో నిర్మించనున్నారని మరో ‘సత్య’ తరహాలో బిగువైన కథ కధనం సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే గాడి తప్పిన మేధావి రామ్ గోపాల్ వర్మ కు రక్త చరిత్ర సినిమా తరువాత మునుపటి మేజిక్ చేయగలడా అనేదే అసలు ప్రశ్న?. వెంకటేష్ తో ఆయన తీసిన క్షణ క్షణం ఇప్పటికీ మ్యూజికల్ క్లాసిక్ గా గుర్తుండిపోయే సినిమా.. ఆ తర్వాత ఈ కలయిక సాధ్యపడలేదు. వెంకీ కూడా వినోదం ట్రాక్ మార్చి తన మాస్ ఇమేజ్ సత్తా మరో సారి చూపించాలని భావిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ కు సర్కార్ సిరీస్, హిట్స్ తో, పూరి జగన్నాధ్ దర్శకత్వం లో అమితాబ్ తో బడే బాప్ సినిమా.. హిట్ నిర్మాతగా వర్మ చేసిన సహాయం మామూలుది కాదు. ఇక విభిన్న పాత్రల కోసం తపించే విజయసేతుపతి వర్మ తో పనిచేయడానికి అభ్యన్తరం ఉండదు. అన్నింటికి మించి అగ్ర నిర్మాణ సంస్థ వెంకీ మామ హిట్ తరువాత సురేష్ ప్రొడక్షన్స్ మరో భారీ సినిమా తియ్యడనికి కసిగా ఉంది. ఏది ఏమైనా అతి త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
