సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత సినీరంగంలో వివాదాస్వాద సినీ దర్శకుడుగా ఖ్యాతి గాంచిన రామ్ గోపాల్ వర్మ వ్యూహం ‘ రెండో ట్రైలర్ ను నేడు, శుక్రవారం విడుదల చేసారు. . దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన యదార్ధ ఘటనలును చూపించేదే వ్యూహం సినిమా అని ఆర్జీవీ తెలిపారు. నవంబరు 10న విడుదల కావాల్సిన ఈ సినిమా ఫై కొందరి పిర్యాదు మేరకు సెన్సా ర్ బోర్డు లో బ్రేక్ పడింది. తర్వాత సెన్సార్ బోర్డు రివైజిం గ్ కమిటీకి మళ్లీ సినిమాను పంపించడంతో వాళ్ళు సినిమాను చూసి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంతో.. డిసెంబర్ 29న వ్యూ హం సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. .నేడు వ్యూహం సినిమా నుంచి మరో ట్రైలర్ను విడుదల చేశారు. మొదటి ట్రైలర్ మాదిరే రెండో ట్రైలర్ కూడా వివాదాస్వాద వర్మ మార్క్ సన్నివేశాలతో ,,రాజకీయ నేతలను పోలిన పాత్రలతో వారి వాహభావాలతో, డైలాగ్స్ తో వైసిపి అభిమానులను అలరిస్తుంది.
