సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో 2 రోజులలో అల్పపీడనం వాయు గుండం ప్రభావం తో మరింత విస్తారంగా వర్షాలు పడుతాయని ఆశగా ఉన్న ఏపీ ప్రజలకు నిరాశ కలిగించే తాజా సమాచారం అందింది. ఇటీవల కాస్త వానలతో ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్న ఏపీ ప్రజలకు వర్ష సూచన ఉన్నప్పటికీ.. ఇంకా పగటి ఉష్ణోగ్రతలు ఎండ వేడి భారీగా పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతం అయ్యిందని.. ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతోందని.. రానున్న రెండు రోజుల్లో అది వాయుగుండంగా మారుతుందన్నారు. అయితే ముందు ఊహించినట్లుగా దీని ప్రభావం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌పై లేదని.. పశ్చిమ బెంగాల్‌పై మాత్రమే ఉందన్నారు. ఈ కారణంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అల్పపీడనం ఏ దశలో ప్రయాణిస్తే.. ఆ ప్రభావిత రాష్ట్రాల్లో మాత్రమే వర్షాలు పడతాయని అన్నారు. అయితే, రానున్న 5 రోజుల్లో ఏపీలో ఒకటి, రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *