సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈసారి రుతుపవనాలు దూకుడు తగ్గిపోవడంతో వర్షాకాలం వాతావరణం వేసవిని తలపిస్తోంది.పశ్చిమ గోదావరి జిల్లాలో గత 10 రోజుల క్రితం వరకు పడిన అడపాదడపా వర్షాలు తరువాత వర్షాలు పడితే ఒట్టు.. వేసవిని ఆలపిస్తున్న మండుటెండలుతో ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. పెద్దగా కరెంట్ వాడకపోతేనే కరెంట్ అదనపు బిల్లులు పెరిగి పోయి ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు ఏసీలు వెయ్యాలంటేనే వచ్చే కరెంట్ బిల్లు తలచుకొని ఏసీ వెయ్యకుండానే వణుకు పుడుతుంది. ఇటీవల ఉదయం 8గంటల నుండే ఎండ సుర్రుమంటుంది. మద్యాహ్నం 12 గంటల నుండి 4గంటల వరకు భీమవరం పట్టణంలో ప్రధాన రహదారులు సైతం జనం లేక నిస్తేజంగా మారిపోతున్నాయి. అసలే దసరా పండుగ రోజులు.. వ్యాపారస్తులు వ్యాపారాలు లేక దిగాలు పడుతున్నారు. మరో వైపు పొలాలలో పంటలు ఎండ తాకిడిని తట్టుకోవడం కష్టంగా ఉంది. పశ్చి మగోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు40 డిగ్రీలకు దగ్గరగా నమోదవుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాలలో గత 10 రోజులుగా 35 డిగ్రీలకు తక్కువ కాకుండా ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉండటం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *