సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవిలో అకస్మాత్తుగా గత 2 రోజులుగా అకాల వర్షాలు పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. భీమవరంలో నేటి శనివారం ఉదయం 10 గంటల నుండి అకస్మాత్తుగా వాతావరణం చల్లబడింది. గురువారం రాత్రి నుండి శుక్రవారం ఎం నేడు, శనివారం ఉదయం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల మంచి కాపు దశలో ఉన్న మామిడికాయలు గాలివానకు రాలిపోగా, అరటితోటలు నేలకొరిగాయి. కోతకు వచ్చిన వరి, మొక్కజొన్నతో పాటు కర్బూజ, దోస, చీనీ, కళింగర వంటి పంటలు దెబ్బతిన్నాయి. ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. అనంతపురం జిల్లాలో రైతులకు రూ.2.15 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. విజయవాడ చుట్టు పక్కల ప్రాంతాల్లో మామిడి, అరటి పంటలు దెబ్బతిన్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. 23 ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా మద్దూరు, ప్రకాశం జిల్లా రాళ్లపల్లిలో అత్యధికంగా 111.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. , గోదావరి జిల్లాలో కోస్త తీరా ప్రాంతంలో ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. సముద్రాల నుంచి వచ్చే తేమగాలులు, వాయవ్య భారతం నుంచి వీచే పొడిగాలుల కలయికతో వాతావరణ అనిశ్చితి, ప్రజలకు తీవ్ర ఉక్కపోత నెలకొంది. మరోవైపు ఉత్తరాంధ్ర లో మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 39.9 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 39.2 డిగ్రీలు,ఎండలు నమోదు కావడం గమనార్హం.
