సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గత 4 రోజులుగా మారిన వాతావరణ పరిస్థితులలో పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేసవిలో అకస్మాత్తుగా చెదురు మదురుగా కురుస్తున్న వర్షాలకు చల్లదనం తో పాటు ఒక్కసారిగా తీవ్రమైన ఎండలు , తీవ్ర ఉక్కబోతతో చెరువులలో రొయ్యలకు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. కొన్ని చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోయి కొంత ఇబ్బంది ఉంటె .. మరి కొన్ని చెరువుల్లో ఆక్సిజన్‌ కోసం ఏర్పాటు చేసిన ఫ్యాన్‌ సీట్లు తిరుగుతున్నప్పటికి ఉక్కపోత ప్రభావంతో రొయ్యలు పైకి రావడంతో ఆక్సిజన్‌ మందులు వాడాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు రైతులు ఈ అనవసర ఖర్చులు బదులు రొయ్యలను కౌంట్ పెద్దగా లేకపోయిన పట్టుబడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గత 3 నెలలుగా రొయ్యధర తగ్గడమే కానీ పెరుగుదల లేదు. పోనీ కొన్ని రోజులు వేచి చూద్దాం అంటే వాతావరణ మార్పులతో వైరస్‌ వంటి వ్యాధుల ప్రబలి రొయ్యల దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. రొయ్యలకు రోగనిరోధక శక్తి కోసం వాటికీ యాంటీ బయోటిక్స్ అధిక మోతాదులో వాడితే మరల అదొక సమస్య.. ఇలా ఆక్వా రైతు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందాన మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *