సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు (AP High Court) గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నేడు, గురువారం జరిగిన విచారణలో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ముందుస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం తాజగా కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. అయితే, ఇదే కేసులో గతంలో 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వారంతా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఈ 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ కోర్టు కూడా నిరాకరించింది. వంశీపై తదుపరి చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
