సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో గుంటూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఫై దాడి ని ప్రోచాహించారన్న ఆరోపణలపై ఎట్టకేలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. రాయదుర్గంలో ఒక ప్లాట్ లో ఉన్న వంశీ ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు డ్రెస్ మార్చుకుంటానని చెప్పి గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. సాధారణంగా పదిహేను నిమిషాల సమయం డ్రెస్ ఛేంజ్ చేసుకునేందుకు సరిపోతుంది. అయినప్పటికీ దాదాపు 30 నిమిషాలకు పైగా సమయాన్ని వంశీ తీసుకున్నారు.ఆయన గది లోపాలకి వెళ్లి తన అరెస్ట్ విషయం తెలియాలని ముందు జాగర్తగా అలోచించి మీడియాకు ఫోన్ చేసి పిలిపించారని పోలీసులు భావిస్తున్నారు. మీడియా వచ్చాక ఆయన పోలీసులతో కలసి బయలు దేరటం విశేషము. మొత్తానికి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్తున్న పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత కోర్టులో హజరుపర్చనున్నారు. సత్యవర్థన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వంశీపై ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *