సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ ఎస్సీ , ఎస్టీ ప్రత్యే క న్యాయస్థానంలో గన్న వరం మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు భారీ ఊరట దక్కింది.. సత్య వర్ధన్‌ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ లభించింది. ఆయన ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఇప్పటికే రెండు సార్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ రెండు సార్లు కూడా బెయిల్‌ తిరస్కరించింది కోర్టు.. మరల మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. ఆ పిటిషన్‌పై ఇటీవల ఇరు వర్గాల తరపు న్యా యవాదులు వాదనలు విన్న కోర్టు.. నేడు, మంగళవారం వల్లభనేని వంశీ మోహన్‌కు బెయిల్ మంజూరు చేసింది.. ఈ కేసులో వల్లభనేని వంశీ తో పాటు మరో నలుగురు నిందితులకు కూడా బెయిల్ ఇచ్చింది విజయవాడలోని ఎస్సీ , ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం .. ఇటీవల వంశీపై ఏపీ పోలీసులు కీలక సెక్షన్ ల క్రింద మొత్తం ఆరు కేసులు పెట్టారు.. ఆ ఆరు కేసుల్లో ఐదు కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ పొందారు వల్లభనేని వంశీ .. కానీ, గన్న వరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఇంకా వంశీకి బెయిల్‌ రాలేదు. ఇప్పుడు సత్య వర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో బెయిల్‌ వచ్చినా.. ఆయన జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *