సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రజలు ప్రభుత్వ సేవలను ఇంటినుంచే పొందేందుకు రాష్ట్రప్రభుత్వం వాట్సప్ లో ‘మనమిత్ర’ పేరిట గవర్నెర్సెను తీసుకొచ్చింది. ఈ కార్య క్రమం ద్వారా రాష్ట్రంలో ఎక్కడినుంచైనా సేవలు పొందేందుకు, ఫిర్యాదులు చేసేందుకు సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈనెల 15వ తేదీనుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 ఈ సేవలను అందించేలా చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జనవరిలో 26 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 161 సేవలతో ‘మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్’ ప్రారంభం కాగా ప్రస్తుతం 500 సేవల దాకా అందుతున్నాయి. వీటిని 15వ తేది నుంచి 700దాకా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో విద్యార్థులకు పరీక్షల హాల్ టికెట్లు, రేషన్ కార్డుల సేవలు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ స్టేటస్‌లు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
