సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి మంగళవారం ఏప్రిల్ 1వ తేదీ నుండి కమర్షియల్ అవసరాల కోసం హోటళ్లు, రెస్టారంట్లు కోసం వినియోగించే 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరలను దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. వివిధ రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న ధరకంటే రూ.41 తగ్గించినట్లు ప్రకటించారు. తాజా ధర తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.1,762, ఉంది. ఇక, ,మహిళలు వంట ఇంటిలో గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలను మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి.
