సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో గత 7 రోజులుగా వాతావరణం తీవ్ర మార్పులకు గురి అవుతుంది. ఉదయం 6న్నర గంటల వరకు చీకటి కొనసాగుతూనే ఉంది విపరీతమైన మంచు పేరుకొని పోతూ 10 గంటల నుంచి సూర్యుడు రగిలి పోతున్నాడు. వేసవి వచ్చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 38 -40డిగ్రీల పైబడి ఎండ దంచి కొడుతోంది. మరల సాయంత్రం 5గంటల కల్లా శ్రీతల పవనాలు గాలులు. ప్రజలు దగ్గు ,రొంప, వళ్ళు నొప్పులు, జ్వరాలతో సీజన్ వ్యాధులు బారిన పడుతున్నారు. దీనికి తోడు బర్ద్ ఫ్లూ బోనస్ గా ఉంది. తాజాగా వాతావరణ శాఖ చెప్పిన సమాచారం ప్రకారం. కోస్తా ఆంధ్ర లో ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా కొన్ని ప్రాంతాలలో రాగల మూడు రోజుల అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అకాగే గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
