సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ వేసవి కాలంలో గతానికి బిన్నంగా వర్షాలు ఎక్కువ పడ్డాయి. గత వారం రోజులుగా ఎదో సమయంలో వర్షం పడని రోజు లేదు. మరి భీమవరం లో ఉరుములు పిడుగులతో కుంభవృష్టిని కూడా చవి చూస్తుంది. గత 2 రోజులుగా ఎండను రానియ్యకుండా మబ్బులు కమ్మేస్తూ .. ఉదయం నుండి రాత్రి వరకు వర్షపు చినుకులతో వాతావరణం ఆహ్లదంగా ఉంది. అయితే వ్యాపారాలు స్తంభించిపోయాయి. రైతులకు ఇబ్బంది. మామిడి పంట పని అయిపోయినట్లే. ఇక గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకొంటే దాదాపు అన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పలు ప్రాంతాలలో రోడ్లతో పాటు అనేక ఇళ్లల్లోకి సైతం నీరు ప్రవహిస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కాకినాడ నగరంలో ఏకంగా 7.2 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. కరప మండలంలో ఏక ధాటిగా వానపడడంతో రాష్ట్రంలోనే అత్యధి కంగా 6.5 సె.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం ధాటికి అనేక రహదారులు మునిగాయి. పంటచేలల్లోకి నీరు వచ్చి చేరింది. కోన సీమ జిల్లాలోని మండపేటలో అతి తక్కువ వ్యవధిలో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
