సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో గురు వారం ఉదయం నుంచి నుండి నేటి శుక్రవారం కూడా ఎడతెరపి లేని భారీ వర్షాలతో జనజీవనం స్థంభించింది. అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లాల ప్రధాన కేంద్రాలు భీమవరం ఏలూరులలో సైతం భారీ వర్షాలతో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భీమవరం నుండి ఏలూరు లేదా కృష్ణ జిల్లా వైపు వెళ్లే జేపీ రోడ్డు, ఉండి రోడ్డు వర్షానికి గుంతలు మరింత పెరిగి గ్రావెల్ బయటకు వచ్చి ద్విచక్ర వాహనదారులకు చాల ఇబ్బందిగా ఉంది. ఇక లోసరి తరువాత తాడేపల్లి గూడెం వైపు రోడ్డు పరిస్థితి చెప్పనక్కరలేదు. జిల్లా వ్యాప్తంగా రోడ్డులు బాగోక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో పంట పొలాలలో వర్షపు నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొగాకు రైతుల పరిస్థితి మరి ఆందోలనగా ఉంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు కొల్లేరు సరస్సులో చేరుతోంది. మండవల్లి మండలం పెద్దఎడ్లగాడి–పెనుమాకలంక రహదారిపై నిన్న నేడు శుక్రవారం రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరికతో కొల్లేరు లంక గ్రామాలకు ముంపు పొంచి ఉంది.
