సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత్ 4 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తాజగా వాయుగుండంగా మారటంతో రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర ల్లో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్ర కాలువ ఉదృతంగా ప్రవహిస్తుంది. పలు గ్రామాలూ నీటమునిగాయి. గోదావరికి భారీ వరద నీరు చేరటంతో సముద్రంలోకి 4 లక్షల సెక్కులు వదిలారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన వర్షాలతో 15 వేల ఎకరాల్లో నాట్లు నీటమునిగి రైతులకు అపారనష్టం వాటిల్లింది. కోనసీమలో వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు మృతి చెందగా, తూర్పులో మరో వ్యక్తి ఎర్రకాలువ ఉధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమ గోదావర్లిలో భారీ వర్షాలకు తాడేపల్లి గూడెం, భీమవరంలో వంటి ప్రధాన పట్టణాల్లో డ్రైయిన్లు పొంగిపొర్లాయి. ఎర్రకాలువ ఉప్పొంగి.. వరద బీభత్సం సృష్టించింది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మిలట్రీ మాధవరం, జగన్నాథపురం, నందమూరు, వంటి పలు గ్రామాల్లో వందలాది ఎకరాలు మునిగిపోయాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో అసలే కష్టాలలో ఉన్న ఆక్వా రైతులు కూడా చెరువులలో చేపలకు రొయ్యలకు ఆక్సిజన్ అందించడానికి పంట ను కాపాడుకోవడానికి ఖర్చు తడిపి మోపెడు అవుతుంది. నేడు, శనివారం ఉమ్మడి గోదావరి కృష్ణ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
