సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది గంటకు 25 కిలోమీటర్లవేగం తో వాయవ్య దిశగా కదులుతోంది. నేటి, మంగళవారం తెల్లవాఱుజాము నుంచి పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుం దని భారత వాతావరణ విభాగం (ఐఎం డీ) ప్రకటించింది. నేటి మంగళవారం మధ్యాహనానికి అల్ప పీడనంగా బలహీనపడి దక్షిణాంధ్ర, తమిళనాడు, పుదుచ్చే రి మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో నేడు, రేపు బుధవారాల్లోఉరుములు, మెరుపులతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోకొన్ని చోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎం డీ తెలిపింది.
