సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు గురువారం వాయుగుండంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భీమవరంలో అయితే ఉదయం 10 గంటల నుండి ఉరుములు పిడుగులతో భారీ వర్షం గత 2 గంటలుగా వర్షం కొనసాగుతూనే ఉంది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, కడప, ఒంగోలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా కందుకూరులో 52.9 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. పలు జిల్లాలలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి, ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. నెల్లూరు,ఒంగోలురాయలసీమ జిల్లాల్లో ప్రభుత్వ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
