సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: త్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తో కోస్తా ఆంధ్రాలో గత 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పడే అందిన తాజా సమాచారం ప్రకారం ఆ అల్పపీడం బలపడి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిందని వాతావరణ కేంద్రం తెలిపింది. అందులోభాగంగా ఈ వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకిందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటి శనివారం నుండి రానున్న మరో నాలుగు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ వాయుగుండం కారణంగా.. కోస్తా తీరంలో గంటకు 45 నుంచి గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో వేటకు వెళ్ల వద్దని మత్స్యకారులకు సూచించింది. అలాగే ఉత్తర కోస్తా తీరా ప్రాంతంలోని పోర్టుల్లో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని స్పష్టం చేసింది.ఈ క్రమంలోకోస్తా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *