సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీని భారీ వర్షాల ముప్పు వదలడంలేదు. బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా బలపడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం నేడు, ఆదివారం ప్రకటించింది. ఇప్పటికే దీని ప్రభావంతో విశాఖ లో రికార్డు స్థాయిలో నేడు, భారీ వర్షం పడుతుండగా భీమవరం తో పాటు గోదావరి జిల్లాల్లో బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నరసాపురం, భీమవరం సముద్ర తీరం వెంబడి మత్య కారులు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు నిషేధ ఆజ్ఞలు జారీ చేసారు. ఉత్తరత్త ఒడిశా, పశ్చి మ బెంగాల్ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రం లో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, ను ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కొనసాగనున్నాయి.
