సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మే చివరి వారం రోహిణి కార్తీ. దీంతో రోళ్ళు బ్రద్దలు అయ్యేలా ఎండలు కాయాల్సి ఉంది. కానీ నైరుతి రుతుపవనాలు ముందే వచ్చేశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మే చివరి మాసంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటింది. ఇది నేటి శుక్రవారం సాయంత్రానికి మరింత బలహీన పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వరుసగా 4 రోజుల పాటు గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారినందున కోస్తా ప్రాంతంలోని మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరించింది.
