సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు బుధవారం ఉదయం నుండి చేదురు మదురుగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు, బుధవారం వాయుగుండంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. వాయువ్య దిశగా గంటకు 10కిమీ వేగంతో వాయుగుండం కదులుతుందని తెలిపారు. ఈ వాయుగుండం చెన్నైకి 440 కి.మీ., పుదుచ్చేరికి 460 కి.మీ, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో ఉందన్నారు. వాయుగుండం రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి మరియు నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. దక్షిణకోస్తా & రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. . రేపుభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు విస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *